ePaper
More
    HomeతెలంగాణMla Prashanth Reddy | సీఎంకు రైతుల కంటే అందాల పోటీలే ముఖ్యమా..?

    Mla Prashanth Reddy | సీఎంకు రైతుల కంటే అందాల పోటీలే ముఖ్యమా..?

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్ : Mla Prashanth Reddy | అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి రైతులు ఆగమవుతున్నారని.. కానీ సీఎం రేవంత్​రెడ్డికి (CM Revanth Reddy)అందాల పోటీలే ముఖ్యమయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో (Balkonda Constituency) కల్లాల వద్ద, రహదారులపై ఇప్పటికీ ధాన్యం రాశులు కుప్పలుగా ఉన్నాయని.. అయినా అధికారులు పట్టించుకోవట్లేదన్నారు. వారి నిర్లక్ష్యంతోనే ధాన్యం వర్షం పాలవుతోందన్నారు. ధాన్యం సేకరణపై రివ్యూ చేయని సీఎం రేవంత్​రెడ్డి అందాలపోటీలపై ఇప్పటికీ ఎనిమిది సార్లు రివ్యూ చేశారని విమర్శించారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

    More like this

    Bodhan | బోధన్​లో ‘ఉగ్ర’​ లింకుల కలకలం

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు...

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....