అక్షరటుడే, అమరావతి: APPSC : ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh లో నిరుద్యోగులకు APPSC శుభవార్త తెలిపింది. 21 ఉద్యోగాలకు నోటిఫికేషన్ job notification విడుదల చేసింది.
ఏపీపీఎస్సీ విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్లో లైబ్రేరియన్ సైన్స్ లో జూనియర్ లెక్చరర్ Junior Lecturer పోస్టులు రెండు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఒకటి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇ ఇంజినీర్ (సివిల్)- 3, డ్రాఫ్ట్ మన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్) – 12+1, హార్టికల్చర్ ఆఫీసర్- 2 పోస్టులు ఉన్నాయి.
APPSC : రేపటి నుంచే దరఖాస్తల ఆహ్వానం..
ఏపీపీఎస్సీ విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించి రేపటి (సెప్టెంబరు 17) నుంచి అక్టోబరు 7 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. పూర్తి వివరాలకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ APPSC website ను సంప్రదించాలని సూచించారు.
