అక్షరటుడే, వెబ్‌డెస్క్: Apprentice | డిగ్రీ, డిప్లొమాలతో తమ సంస్థలో అప్రెంటిస్ (Apprentice) అవకాశాలు కల్పించేందుకు ఈస్టర్న్ కోల్డ్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (Coldfields Limited) నోటిఫికేషన్ జారీ చేసింది. 1,123 మందికి అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ నాట్స్ పోర్టల్ ద్వారా పీజీపీటీ (PGPT), పీడీపీటీలలో వివిధ ట్రేడ్‌లలో అవకాశాలు ఇవ్వనుంది. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
విభాగాల వారీగా వివరాలు..
పీజీపీటీలో మొత్తం అవకాశాలు : 280.
మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో 180, సివిల్ ఇంజినీరింగ్‌లో 25, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 25, కంప్యూటర్ సైన్స్ అండ్‌ఇంజినీరింగ్‌లో 25, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 25 మందికి అవకాశం ఉంటుంది.
పీడీపీటీలో మొత్తం అవకాశాలు : 843.
మైనింగ్ ఇంజినీరింగ్(Mining engineering) విభాగంలో 643, సివిల్ ఇంజినీరింగ్‌లో 50, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 50, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో 50, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 50 మందికి అవకాశం ఉంటుంది.
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ(Degree), డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. క్వాలిఫయింగ్ ఎగ్జామ్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించినవారు అర్హులు.
స్టైఫండ్ వివరాలు : నెలకు పీజీపీటీలకు రూ.9 వేలు, పీడీపీటీ(PDPT)లకు రూ.8 వేలు.
ఎంపిక విధానం : విద్యార్హతల మెరిట్ ఆధారంగా..
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 11.
దరఖాస్తు, పూర్తి వివరాలకు https://www.easterncoal.nic.in/ వెబ్‌సైట్‌లో సంప్రదించాలి.