RCFL Notification | డిప్లొమాతో ఆర్‌సీఎఫ్‌లో అప్రెంటిస్‌ అవకాశాలు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : RCFL Notification | అర్హులైన వారికి అప్రెంటిస్‌ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌(RCFL) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయి, రాయ్‌గడ్‌ యూనిట్లలో అవకాశాలు కల్పించనుంది. నోటిఫికేషన్‌(Notification) వివరాలిలా ఉన్నాయి. మొత్తం ఖాళీలు : 325 పోస్టులవారీగా వివరాలు.. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌(Graduate Apprentice) – 115, టెక్నిషియన్‌ అప్రెంటిస్‌ – 114, ట్రేడ్‌ అప్రెంటిస్‌ – 96. ఇందులో ఎస్సీలకు 48, ఎస్టీలకు 24, ఓబీసీ(OBC)లకు 87, ఈడబ్ల్యూఎస్‌ 32 […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : RCFL Notification | అర్హులైన వారికి అప్రెంటిస్‌ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌(RCFL) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయి, రాయ్‌గడ్‌ యూనిట్లలో అవకాశాలు కల్పించనుంది. నోటిఫికేషన్‌(Notification) వివరాలిలా ఉన్నాయి.

మొత్తం ఖాళీలు : 325
పోస్టులవారీగా వివరాలు..
గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌(Graduate Apprentice) – 115, టెక్నిషియన్‌ అప్రెంటిస్‌ – 114, ట్రేడ్‌ అప్రెంటిస్‌ – 96.
ఇందులో ఎస్సీలకు 48, ఎస్టీలకు 24, ఓబీసీ(OBC)లకు 87, ఈడబ్ల్యూఎస్‌ 32 పోస్టులు రిజర్వ్‌ చేశారు.

విద్యార్హత : ఇంటర్మీడియట్‌, డిప్లొమా, డిగ్రీ/బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి, కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి.

స్టైపెండ్‌ : పోస్టును బట్టి నెలకు రూ. 7 వేలనుంచి రూ. 9 వేల వరకు స్టైపెండ్‌(Stipend) ఇస్తారు.

వయోపరిమితి : 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లవరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు గడువు : ఈనెల 12.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..

ఎంపిక విధానం : అభ్యర్థుల విద్యార్హతలు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకోసం వెబ్‌సైట్‌ https://www.rcfltd.com లోకి వెళ్లి హెచ్‌ఆర్‌ విభాగంలో రిక్రూట్‌మెంట్‌లో సంప్రదించాలి.

Related articles

Delhi Bomb Threat | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు

ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఎర్రకోటతో పాటు రెండు పాఠశాలల్లో బాంబు పెట్టినట్లు దుండగులు మెయిల్​ పంపారు.

Trump Tariffs Suspended | రేపటి నుంచి నిలిచిపోనున్న ట్రంప్​ టారిఫ్​లు

పలు దేశాలపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు రేపటి నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ASHA Workers Arrest | సీఐటీయూ, ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్​

బాన్సువాడ పట్టణంలో సీఐటీయూ నాయకులను, ఆశకార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Soumya Government Job | ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.