4
అక్షరటుడే, ఇందూరు: Apprenticeship Mela | ఉమ్మడి జిల్లాలో ఐటీఐ (ITI) పూర్తి చేసిన విద్యార్థులకు ఈనెల 9న అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ యాదగిరి తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువత పదో తరగతి, ఐటీఐ సర్టిఫికెట్లతో పాటు ఆధార్ కార్డ్, పాస్పోర్టు సైజ్ ఫొటోతో శివాజీ నగర్లో ఉన్న ఉపాధి కల్పనా కార్యాలయంలో హాజరుకావాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9441707536 సంప్రదించాలని వివరించారు.