అక్షరటుడే, ఇందూరు: RTC | తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) నిజామాబాద్ రీజియన్ పరిధిలోని వివిధ డిపోలలో అప్రెంటీస్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్, గ్రాడ్యుయేట్, డిప్లొమా పూర్తి చేసిన వారు ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని (Nizamabad district) ఆయా ఆర్టీసీ డిపోలో మూడు సంవత్సరాల అప్రెంటీస్ శిక్షణ కోసం అవకాశం కల్పిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోత్న్స తెలిపారు.
2021, ఆ తర్వాత ఇంజినీరింగ్, డిప్లొమాలో ఆటోమొబైల్, మెకానిక్ అభ్యర్థులు, డిగ్రీలో బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఏ చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను నేషనల్ అప్రెంటీస్ ట్రైనింగ్ స్కీం వెబ్ పోర్టర్లో నమోదు చేసుకొని టీజీ ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ లో అప్లయ్ చేసుకోవాలని కోరారు. మెరిట్ ప్రకారం ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.