HomeUncategorizedIOC | ఐవోసీలో అప్రెంటిస్‌ పోస్టులు

IOC | ఐవోసీలో అప్రెంటిస్‌ పోస్టులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IOC | దేశవ్యాప్తంగా పలు అప్రెంటిస్‌(Apprentice) పోస్టుల భర్తీ కోసం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(Indian oil corporation) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ రీజియన్‌లలో వీటిని భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌(Notification) వివరాలిలా ఉన్నాయి.

ఖాళీల సంఖ్య 537.

IOC | ఖాళీల వివరాలు..

సథరన్‌ రీజియన్‌ పైప్‌లైన్స్‌(Southern Region Pipelines)లో 47(ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 18, తెలంగాణలో 5), ఈస్టర్న్‌ రీజియన్‌ పైప్‌లైన్స్‌లో 156, వెస్టర్న్‌ రీజియన్‌ పైప్‌లైన్స్‌లో 152, నార్తర్న్‌ రీజియన్‌ పైప్‌లైన్స్‌లో 97, సౌత్‌ ఈస్టర్న్‌ రీజియన్‌ పైప్‌లైన్స్‌లో 85 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

  • విద్యార్హత : పదో తరగతి, ఇంటర్‌తోపాటు సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసినవారు అర్హులు.
  • వయోపరిమితి : ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 18 నుంచి 24 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..
  • దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబర్‌ 18.
  • ఎంపిక విధానం : విద్యార్హతలలో సాధించిన మెరిట్‌ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
  • అప్రెంటిస్‌షిప్‌(Apprenticeship) ట్రెయినింగ్‌ పీరియడ్‌ : 12 నెలలు. పూర్తి వివరాల కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ https://iocl.com ను సంప్రదించండి.