అక్షరటుడే, కామారెడ్డి : Telangana Rajyadhikara Party | తెలంగాణ రాజ్యాధికార పార్టీ కామారెడ్డి (Kamareddy) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను నియమించారు. ఈ మేరకు గురువారం రాత్రి పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా డా. మహమ్మద్ తాహెర్ బిన్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బొక్కల సంతోషిని నియమించారు.
జిల్లాలో పార్టీ (Telangana Rajyadhikara Party) బలోపేతం కోసం పని చేయాలని సూచించారు.ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన పార్టీ అధ్యక్షుడు మల్లన్నకు, వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు ఓదెలు, ప్రధాన కార్యదర్శి జానయ్య, సూర్యారావు, జిల్లా ఇన్ఛార్జి హన్మాండ్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీని సంస్థాగత దిశగా అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీని బలోపేతం చేస్తామన్నారు.
