అక్షరటుడే, వెబ్‌డెస్క్: PCC Chief Mahesh Goud | కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌గౌడ్ (PCC Chief Mahesh Goud) ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ సంస్థగత నిర్మాణంలో భాగంగా వీరిని నియమించారు. ఖమ్మం ఇన్ఛార్జీగా వంశీచంద్‌రెడ్డి, నల్గొండ సంపత్‌కుమార్, మెదక్ పొన్నం ప్రభాకర్, వరంగల్ అడ్లూరి లక్ష్మణ్, హైదరాబాద్ జగ్గారెడ్డి, రంగారెడ్డి శివసేనారెడ్డి, ఆదిలాబాద్-అనిల్ కుమార్ యాదవ్, కరీంనగర్ అద్దంకి దయాకర్, మహబూబ్‌నగర్ కుసుమ కుమార్, నిజామాబాద్‌కు అజ్మత్ హుస్సేన్ ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు.
రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు(Local Elections) జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయాలని కాంగ్రెస్(Congress) భావిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలను(Incharges) నియమించారు. వీరు ఆయా జిల్లాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలపై ఫోకస్ పెట్టనున్నారు. కొత్తగా ఇన్ఛార్జీలుగా నియమితులైన వారు వెంటనే రంగంలోకి దిగాలని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్(PCC President Mahesh Goud) సూచించారు. ఈ మేరకు వారితో జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు.
Read all the Latest News on Aksharatoday.in