అక్షరటుడే, వెబ్‌డెస్క్: Governors | కేంద్ర ప్రభుత్వం(Central Government) మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్ల నియామకాలను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గోవా గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు (Goa GovernorAshok Gajapathi Raju), హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్ (Haryana Governor Ashin Kumar Ghosh), లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తా (Ladakh Lieutenant GovernorKavinder Gupta)ను కేంద్రం నియమించింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు చెందిన కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. 2014 నుంచి 2018 వరకు ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉండడంతో ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడికి గవర్నర్‌గా అవకాశం ఇచ్చారు. కాగా.. ఆయన గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మరోవైపు తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్ బాధ్యతల నుంచి తప్పించారు.
హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్, యూనియన్ టెరిటరీ లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తాను కేంద్రం నియమించింది. కాగా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేసిన బీడీ మిశ్రా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి కొత్త గవర్నర్‌గా జమ్మూ కశ్మీర్ డిప్యూటీ సీఎంగా పనిచేసిన కవిందర్ గుప్తాను నియమించారు.