Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Congress | మెజారిటీ కార్యకర్తల సూచన మేరకే డీసీసీ అధ్యక్షుడి నియామకం : ఏఐసీసీ...

Nizamabad Congress | మెజారిటీ కార్యకర్తల సూచన మేరకే డీసీసీ అధ్యక్షుడి నియామకం : ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ హర్షద్

కార్యకర్తల సూచన మేరకే డీసీసీ అధ్యక్షుడి నియామకం జరుగుతుందని ఏఐసీసీ పరిశీలకుడు రిజ్వాన్​ హర్షద్​ పేర్కొన్నారు. నగరంలోని హరిత హోటల్​లో సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Congress | మెజారిటీ కార్యకర్తల సూచన మేరకే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకం ఉంటుందని ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ హర్షద్ (AICC Observer Rizwan Harshad) స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని హరిత హోటల్​లో (Haritha Hotel) సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

డీసీసీ అధ్యక్షుడి నియామకం విషయంలో ఈసారి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లాను మొత్తం 11 బ్లాక్​లుగా విభజించడం జరిగిందని, జిల్లాలోని ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను కలుపుకొని రాబోయే ఎనిమిది రోజులపాటు అన్ని బ్లాక్​లలో పర్యటించడం జరుగుతుందన్నారు.

ఐదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో (Congress Party) పనిచేస్తున్నవారు ఎవరైనా డీసీసీ అధ్యక్షుడిగా పోటీ చేయవచ్చన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం వచ్చిన దరఖాస్తులను స్వీకరించిన అనంతరం కార్యకర్తల అభిప్రాయo మేరకే నియామకం ఉంటుందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రతీ కార్యకర్తను, మండల కమిటీ నాయకులను తాను ప్రత్యక్షంగా కలవనున్నట్లు పేర్కొన్నారు.

జిల్లాలో మొత్తం 1,20,000 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు రిజ్వాన్​ హర్షద్​ పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్ పార్టీని (BRS Party) ఓడించి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగిందని, అదేవిధంగా రాబోయే లోక్​సభ ఎన్నికల్లో కూడా దేశంలోని అన్ని జిల్లాల్లో డీసీసీలను బలోపేతం చేసి వారి ఆధ్వర్యంలో కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆరేపల్లి మోహన్, అరికెల నర్సారెడ్డి, తాహెర్ బీన్ హందాన్, కేశ వేణు, ఏనుగు రవీందర్ రెడ్డి, అంతిరెడ్డి రాజారెడ్డి, గడుగు గంగాధర్, రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.