84
అక్షరటుడే, ఇందూరు : Nizamabad City | భారత ప్రభుత్వ జిల్లా స్టాండింగ్ కౌన్సిల్‌గా సీనియర్ న్యాయవాది సాయిరెడ్డి (Senior Advocate Sai Reddy) నియమితులయ్యారు. అలాగే అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ (Additional Standing Counsel)గా సీనియర్ న్యాయవాదులు కృష్ణ ఆనంద్, మల్లెపూల జగన్మోహన్ గౌడ్, నాగేశ్వర్, ఆకుల సురేష్, వెంకటేశ్వర్, నరసింహారెడ్డి, రాజేశ్వర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ (Union Ministry of Law) ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడంలో ప్రభుత్వం తరఫున వీరు వాదించనున్నారు. వీరు మూడు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.