అక్షరటుడే, నిజాంసాగర్: BJP Kamareddy : కామారెడ్డి జిల్లాలో బీజేపీ మండలాధ్యక్షుల (BJP Presidents) నియామకాన్ని పూర్తి చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు(Neelam Chinnarajulu) పేర్కొన్నారు.
మద్నూర్ మండలానికి తుకారాం, నిజాంసాగర్ మండలానికి మేకల నరేష్, పిట్లంకు సాయి రెడ్డి, మహమ్మద్ నగర్‌కు శ్రీకాంత్, పెద్దకొడప్గల్కు బాలాజీ పటేల్, గాంధారికి మధుసూదన్, రామారెడ్డికి నోముల సందీప్, సదాశివ నగర్‌కు రామిరెడ్డి, ఎల్లారెడ్డి రూరల్‌కు నర్సింలును నూతన అధ్యక్షులుగా నియమించినట్లు తెలిపారు. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.