అక్షరటుడే, ఇందూరు : BJP | భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు (Ramchandra Rao) అనుమతితో ఎంపీ ధర్మపురి అరవింద్, సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ సూచనతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు.
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా నక్క రాజేశ్వర్, రాంచందర్, బంటు రాము, పోతుగంటి సురేందర్, ప్రమోద్‌కుమార్, పాలెపు రాజు నియమితులయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శులుగా పోతంకర్ లక్ష్మీనారాయణ, నిమ్మల శ్రీనివాస్‌రెడ్డి, నాగోళ్ల లక్ష్మీనారాయణను ఎన్నుకున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
బీజేపీ జిల్లా కార్యదర్శులుగా సంగం అనిల్, నోముల నర్సారెడ్డి, పొల్కం వేణు, దంపల్లి జ్యోతి, రాధ, సవిత ఎంపికయ్యారు. కోశాధికారిగా చింతకింది శ్రీనివాస్‌రెడ్డి, ఆఫీస్ సెక్రెటరీగా బద్దం కిషన్, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కూరెళ్ల శ్రీధర్, మీడియా కన్వీనర్‌గా పుట్ట వీరేందర్, ఐటీ ఇన్ఛార్జీగా పిల్లి శ్రీకాంత్‌ను నియమిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు.
పార్టీ కోసం పనిచేసిన వారికే పట్టం
బీజేపీ జిల్లా నూతన కమిటీ ఎంపిక విషయంలో నాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసే వారికే పట్టం కట్టారు. ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ దిశగా పనిచేసే నాయకులకు పదవులు ఇచ్చారు. ఈ విషయంలో ఎంపీ అర్వింద్ గత కొద్ది రోజులు కసరత్తు జరిపి నూతన కమిటీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి యువతకు పెద్దపీట వేశారు. ఇది వరకు మాజీ ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారు, వివిధ హోదాల్లో కొనసాగిన అనుభవం కలిగిన వారికి నూతన కమిటీలో స్థానం కల్పించారు. ఎంపికలో ఎంపీ అర్వింద్ మార్క్ స్పష్టంగా కనబడినట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సూచన మేరకు జిల్లా కమిటీని ఆచితూచి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.