అక్షరటుడే, ఎల్లారెడ్డి : Rythu Bima | రైతుబీమా (Rythu Bima) కోసం అర్హులైన రైతులు (Farmers) దరఖాస్తు చేసుకోవాలని ఎల్లారెడ్డి ఏవో నదీమొద్దీన్ (Yellareddy AO Nadimoddin) సూచించారు. 2025 జూన్ వరకు కొత్తగా పట్టా పాస్‌పుస్తకాలు పొందిన రైతులు, అలాగే ఇదివరకు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోని రైతులు అర్హులన్నారు. ఈనెల13 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంతకుముందు రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నవారు నామినీ (Nominee) మార్పు కోసం ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు ఫారం, పట్టా పాస్‌బుక్, ఆధార్, నామినీ ఆధార్ ప్రతులతో ఏఈవోలను సంప్రదించాలన్నారు.
