అక్షర టుడే, భీమ్‌గల్: Beedi Scholarship | ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న బీడి కార్మికుల పిల్లలు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంఈవో బట్టు రాజేశ్వర్ (MEO Battu Rajeshwar) సూచించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
2025–26 విద్యా సంవత్సరానికిగాను ఆన్‌లైన్‌లో దరఖాస్తులు (online Applications) చేసుకోవాలన్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఆగస్టు 31లోగా, ఇంటర్, డిగ్రీ, ఆపై కోర్సులు చదివేవారు అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మెమో, బ్యాంక్ పాస్‌బుక్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బీడీ కార్మికురాలి గుర్తింపు కార్డు, అపాయింట్‌మెంట్ లెటర్‌తో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సందేహాలుంటే హెల్ప్‌లైన్ నంబర్ 0120 – 6619540, వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, కేంద్రీయ సదన్, ఫోన్ నంబర్ 040–29561297 నంబర్‌తో పాటు దగ్గరలో ఉన్న బీడీ కార్మికుల దవాఖానాలో సంప్రదించవచ్చన్నారు.