అక్షరటుడే, ఎల్లారెడ్డి: ITI Hanmakonda | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telanagana State) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ), ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని హన్మకొండ ఐటీఐ ప్రిన్సిపాల్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
దరఖాస్తులకు సంబంధించి www.iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో పదో తరగతి మెమో, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను అప్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
అలాగే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ ప్రతులతో హన్మకొండలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో (Government ITI College) ఈనెల 28వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రన్సిపల్ సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.