అక్షరటుడే, ఇందూరు : DEO Ashok | విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో అశోక్ సూచించారు. విజ్ఞాన భారతి (Vijnan Bharathi) ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షల కరపత్రాలను సోమవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభ వెలికితీసేందుకు ఇలాంటి పరీక్షలు ఉపయోగపడతాయన్నారు. ఈనెల 30లోపు ఆన్‌లైన్‌లో https://ncsm.gov.in/vidyarthi-vigyan-manthan-vvm# దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కో-ఆర్డినేటర్లు శ్రీపాద్, ముద్దు కృష్ణ తెలిపారు.
జాతీయ స్థాయి విజేతలకు ఇంటర్న్‌షిప్ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షలో ఆయా తరగతుల సైన్స్, గణిత శాస్త్రం, లాజికల్ థింకింగ్ అండ్ రీజనింగ్, పురాణాల నుంచి ఆధునిక భారతీయ శాస్త్రవేత్తల కృషి గురించి ప్రశ్నలు వస్తాయని వివరించారు.