12
అక్షర టుడే, ఆర్మూర్ : Armoor Town | పట్టణ పరిధిలోని పెర్కిట్ మహిళా ప్రాంగణంలో వివిధ కోర్సుల్లో అందిస్తున్న శిక్షణకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి ఇందిర సూచించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మూడు నెలల నర్సింగ్ (nursing), నెలరోజుల టైలరింగ్, బ్యూటిషన్లో (tailoring and beautician) శిక్షణకు ఈనెల 16లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 18 –35ఏళ్ల లోపు మహిళా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. నర్సింగ్ కోర్సుకు పదో తరగతి మెమో, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుకు 8వ తరగతి బోనాఫైడ్తో పాటు ఆధార్, కుల,ఆదాయ ధ్రువపత్రాలు, 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో మహిళా ప్రాంగణంలో సంప్రదించాలని సూచించారు.