అక్షరటుడే, కామారెడ్డి/ఎల్లారెడ్డి: Guest Faculty Posts | కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government Degree College) అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు విజయ్ కుమార్, లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. దరఖాస్తులకు సంబంధించి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Guest Faculty Posts | కామారెడ్డి డిగ్రీ కళాశాలలో..
తెలుగు–3, హిందీ –1, ఇంగ్లీష్–2, పొలిటికల్ సైన్స్–1, హిస్టరీ–1, బీబీఏ–1, కంప్యూటర్ సైన్స్–3, ఫారెస్ట్రీ – 2, ఫిషరీస్ –1, జువాలజీ–1, మ్యాథమెటిక్స్ –1, స్టాటిస్టిక్స్ –1, ఫిజిక్స్ –1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా సబ్జెక్టులు బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సంబంధిత సబ్జెక్టులో 55శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులు అర్హులని, పీహెచ్‌డీ/ నెట్/సెట్/బోధనానుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 23 సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, 24న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.
Guest Faculty Posts | ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో..
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్–2, ఇంగ్లిష్ –1, భౌతికశాస్త్రం–1, రాజనీతి శాస్త్రం–1, హిందీ–1, జంతుశాస్త్రం–1 బోధించేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయా సబ్జెక్టులో 55శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులు అర్హులని, పీహెచ్‌డీ/నెట్/సెట్, బోధనానుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 23 సాయంత్రం 4 గంటలవరకు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. 24న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.