అక్షరటుడే, భీమ్గల్ : Open School Exams | వివిధ కారణాలతో చదువు మధ్యలో మానేసి ఎస్సెస్సీ, ఇంటర్ చదవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం (State Government) ప్రత్యేక అవకాశం కల్పించింది. ‘టాస్’ పేరుతో ఓపెన్ స్యూల్ విధానంలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ పరీక్షలు రాసేందుకు అవకాశాన్ని కల్పించింది.
Open School Exams | చదువు మానేసిన విద్యార్థులకు..
రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ స్కూల్ విధానంలో ఎస్సెస్సీ (SSC), ఇంటర్ పరీక్షలు (School Exams) రాసే అవకాశాన్ని కల్పించింది. మీ సేవ కేంద్రంలో ఫీజు చెల్లించి ఓపెన్ స్కూల్ విధానంలో ఎస్సెస్సీ పరీక్షలు రాయవచ్చు. అదేవిధంగా ఎస్సెస్సీ పాసై చదువు మానేసిన వారు ఇప్పుడు ఓపెన్ విధానంలో ఇంటి నుండే ఇంటర్ పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉంది.
Open School Exams | అవగాహన కల్పించాలి
మహిళా సంఘాల సభ్యులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు యువజన సంఘాలు ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 14 ఏళ్లు నిండి చదువు మధ్యలో ఆపేసిన ప్రతిఒక్కరూ మీసేవలో ఫీజు కట్టి పరీక్షలు రాయవచ్చు.
పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 17వ తేదీ చివరి తేదీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ఏర్గట్ల ఎంఈవో ఆనంద్ రావు, ఐకేపీ ఏపీఎం కుంట గంగాధర్ మాట్లాడుతూ.. చదువు మధ్యలో మానేసిన వారికి ఇది సువర్ణ అవకాశమన్నారు. ఏర్గట్ల మండలంలో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో లేదా ఎంఈవో, జిల్లా పరిషత్ స్కూల్ హెచ్ఎం, మీసేవ కేంద్రాల్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.