- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిLiquor Shops | మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

Liquor Shops | మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి/నిజామాబాద్‌: Liquor Shops | కామారెడ్డితో పాటు నిజామాబాద్‌ జిల్లాలో నూతన మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇరు జిల్లాల ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు హన్మంత్‌రావు, మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

కామారెడ్డికి సంబంధించి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తులు స్వీకరించనుండగా, నిజామాబాద్‌కు సంబంధించి సుభాష్‌నగర్‌లోని ఎక్సైజ్‌ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.

- Advertisement -

కామారెడ్డిలో 49, నిజామాబాద్‌లో 102 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 9, రామారెడ్డి-1, మాచారెడ్డి-2, సదాశివనగర్‌-2, పాల్వంచ-1, దోమకొండ-2, భిక్కనూర్‌-2, బీబీపేట-2, రాజంపేట-1, తాడ్వాయి-1, ఎల్లారెడ్డి-2, లింగంపేట-2, గాంధారి-2 దుకాణాలు అలాట్​ అయ్యాయి.

నాగిరెడ్డిపేట-1, బాన్సువాడ-5, బీర్కూర్‌-1, నస్రుల్లాబాద్‌-2, నిజాంసాగర్‌-1, బిచ్కుంద-2, జుక్కల్‌-2, మద్నూర్‌-2, పిట్లం-3, పెద్ద కొడప్‌గల్‌-1 మద్యం దుకాణాలు ఉన్నాయన్నారు. వీటిలో గౌడ్‌లకు-7, ఎస్సీ-5, ఎస్టీ-2 దుకాణాలను కేటాయించినట్లు తెలిపారు. బాన్సువాడలోని 33 వ మద్యం దుకాణానికి శుక్రవారం అల్లి సంగమేశ్వర్‌ అనే వ్యక్తి మొదటి టెండర్‌ వేసినట్లు పేర్కొన్నారు.

Liquor Shops |  నిజామాబాద్​లో..

నిజామాబాద్‌లో పరిశీలిస్తే నిజామాబాద్‌–36, ఆర్మూర్‌-25, బోధన్‌-18, భీంగల్‌-12, మోర్తాడ్‌-11 మద్యం దుకాణాలకుగాను ఎస్సీ,ఎస్టీ, గౌడ్‌లకు 24 మద్యం దుకాణాలు కేటాయించినట్లు చెప్పారు.

దరఖాస్తు చేసుకునేవారు రూ.3 లక్షల (నాన్‌ రిఫండబుల్‌) ఒరిజినల్‌ డీడీ/చలాన్‌తోపాటు సెల్ఫ్‌ సెర్టిఫైడ్‌ ఆధార్‌/పాన్‌కార్డ్, మూడు కలర్‌ పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, రిజర్వ్డ్​ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసేవారు కుల ధ్రువీకరణ పత్రం జత చేయాలని సూచించారు. అక్టోబర్‌ 18 వరకు దరఖాస్తులకు గడువు ఉంటుందని, నవంబర్‌ 1నుంచి మద్యం దుకాణాలు ప్రారంభమవుతాయన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News