Homeజిల్లాలుకామారెడ్డిBanswada | అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Banswada | అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బాన్సువాడ ఎస్ఆర్ఎన్​కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (SRNK Government Degree College) అతిథి అధ్యాపక పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్ తెలిపారు. తెలుగు/ఇంగ్లిష్​ మీడియంలలో బోటనీ, కామర్స్, క్రాప్ ప్రొడక్షన్, ఎకనామిక్స్, హిస్టరీ, గణితం, పొలిటికల్ సైన్స్, తెలుగు, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఒక్కో పోస్టు, కంప్యూటర్ అప్లికేషన్​లో రెండు పోస్టుల చొప్పున ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఉర్దూ మీడియంలో బోటనీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఉర్దూ, జువాలజీ సబ్జెక్టులలో ఒక్కో పోస్టు ఖాళీలు ఉన్నాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 23 సాయంత్రం నాలుగు గంటల్లోగా దరఖాస్తులను కళాశాలలో అందజేయాలని సూచించారు. 24న ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల కామారెడ్డిలో (Kamareddy) ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. సెట్/ నెట్/ పీహెచ్​డీ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.