అక్షరటుడే, వెబ్డెస్క్: ITI Admissions | ఐటీఐల్లో ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు(Education officers) ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రవేట్ ఐటీఐలతో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్(ATC)లలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 2 నుంచి 21 వరకు ఆన్లైన్(Online)లో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, ఎనిమిదో తరగతి పాసైన అభ్యర్థులు అర్హులు. ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి కనీసం 14 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారిని పరిగణనలోకి తీసుకోరు. గరిష్ట వయోపరిమితి లేదు. దరఖాస్తు సమయంలో రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని రకాల సర్టిఫికెట్లను స్కాన్ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. అభ్యర్థులు ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. మెరిట్, అర్హతను బట్టి రాష్ట్రంలోని ఐటీఐ(ITI)ల్లో సీట్లు కేటాయిస్తారు.