అక్షరటుడే, ఇందూరు: Government Medical College | నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమోహన్ తెలిపారు.
ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఆగస్టు ఒకటి నుంచి 11వ తేదీలోపు మెడికల్ కళాశాలలో అందజేయాలని సూచించారు. 13వ తేదీన దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపారు. అనంతరం కళాశాలలోనే ఆగస్టు 14న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందని సూచించారు.
Government Medical College | కళాశాలలో పోస్టులివే..
వైద్య కళాశాలలో ప్రొఫెసర్ (Professor) పోస్టులు–3, అసోసియేట్ ప్రొఫెసర్ (Associate Professor) పోస్టులు–5, అసిస్టెంట్ ప్రొఫెసర్–31, ట్యూటర్–5, సీనియర్ రెసిడెంట్ పోస్టులు–24 భర్తీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇతర వివరాలకు మెడికల్ కళాశాలలో సంప్రదించాలని లేదా www.gmcnzb.org వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.