Homeజిల్లాలునిజామాబాద్​Guest lecturers | అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Guest lecturers | అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Guest lecturers | ప్రభుత్వ డైట్ కళాశాలలో (Government Diet College) ఖాళీగా ఉన్న పోస్టులకు అతిథి అధ్యాపక(Diet College) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో సోషియాలజీ-1, సైకాలజీ-1, సైన్స్-1, గణితం-2, సోషల్-1, తెలుగు లాంగ్వేజ్- 1, ఆరోగ్య వ్యాయామ విద్య- 1, ఫైన్ ఆర్ట్స్ -1, ఉర్దూ మీడియంలో ఫిలాసఫీ లేదా సైకాలజీ-1, సైన్స్-1,గణితం- 1, ఉర్దూ లాంగ్వేజ్- 1, సోషల్ సైన్స్-1 పోస్టు ఖాళీలు ఉన్నాయన్నారు.

అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఈడీ అర్హత కలిగి ఉండాలన్నారు. ఒకవేళ ఎంఈడీ అభ్యర్థులు అందుబాటులో లేకపోయినట్లయితే సంబంధిత సబ్జెక్టులో బీఈడీ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 13 నుంచి 19వ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తులను అందజేయాలని సూచించారు. మెరిట్ ప్రకారం ఈ నెల 24 నుంచి 26వ తేదీల్లో ఇంటర్వ్యూ, డెమో నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.