4
అక్షర టుడే, ఇందల్వాయి: Eklavya schools | ఉమ్మడి జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని నోడల్ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ (nodal in-charge principal) కోరారు. గాంధారిలోని బాలుర, ఇందల్వాయిలోని బాలికల పాఠశాలల్లో ఇంటర్లో తాత్కాలిక ఖాళీల కోసం ఈనెల 14 నుంచి 24 వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. గాంధారి కళాశాలలో బైపీసీలో 23, సీఈసీలో 14 ఖాళీలు, ఇందల్వాయి బాలికల కళాశాలలో బైపీసీ 15, సీఈసీ 18 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. పదో తరగతిలో మార్కుల ఆధారంగా అడ్మిషన్ ఉంటుందన్నారు.