అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Police Prajavani | జిల్లా కేంద్రంలో సీపీ కార్యాలయంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రజావాణికి భారీ స్పందన వస్తోంది. ఆయా పోలీస్స్టేషన్ల పరిధుల్లో పరిష్కారం కాని సమస్యలను బాధితులు నేరుగా సీపీ సాయిచైతన్యకు (CP Sai Chaitanya) విన్నవించుకుంటున్నారు. ఆయన సైతం తన వద్దకు వచ్చిన సమస్యలను సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసర్లకు (Station House Officers) సమాచారమిస్తూ.. చట్టపరంగా పరిష్కార మార్గాలను చూపాలని ఆదేశిస్తున్నారు.
Police Prajavani | ఆర్నెళ్లుగా 352 ఫిర్యాదులు..
గత ఆర్నెళ్ల నుంచి జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో (Police Commissionerate Office) సీపీ సాయిచైతన్య పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 352 ఫిర్యాదులు రాగా వాటికి పరిష్కార మార్గం చూపారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమానికి నిజామాబాద్ కమిషనరేట్ (Nizamabad Commissionerate) పరిధిలోని బాధితులు తరలివస్తున్నారు. నేరుగా సీపీతో మాట్లాడుతున్నారు. తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.
Police Prajavani | నిర్భయంగా.. మరోవ్యక్తి ప్రమేయం లేకుండా..
జిల్లా ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీల్లేకుండా నేరుగా తనను కలవొచ్చని సీపీ సాయిచైతన్య గతంలో పేర్కొన్నారు. ఈ మేరకు బాధితులు సీపీ కార్యాలయంలో సాయిచైతన్యను కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ప్రధానంగా కుటుంబ తగదాలు, భూసమస్యలు, భార్య-భర్తల పంచాయతీలు, ఇంటి నిర్మాణాల్లో కొట్లాటలు సీపీ వద్దకు వస్తున్నాయి. వాటిని చట్ట ప్రకారం పరిష్కార మార్గం చూపాలని సీపీ సిబ్బందికి ఆదేశిస్తున్నారు.