అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Overseas Scholarship | విదేశాల్లో చదువుతున్న మైనారిటీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక వార్త చెప్పింది. సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది.
విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్/పీహెచ్డీ చదువుతున్న మైనారిటీ విద్యార్థులకు (Minority Students) (ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ) ప్రభుత్వం స్కాలర్షిప్ మంజూరు చేస్తోంది. దీని కోసం దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ కార్యదర్శి సూచించారు. అర్హత కలిగిన అభ్యర్థులు www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ వంటి దేశాల విదేశీ విశ్వవిద్యాలయాల్లో (Foreign Universities) విద్యను అభ్యసిస్తున్న మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
CM Overseas Scholarship | రూ.20 లక్షల స్కాలర్షిప్
ఈ స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 20 నుంచి జనవరి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 2025 జూలై 1 నుంచి డిసెంబర్ 31 మధ్య అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు అర్హులు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత జిల్లా మైనారిటీల సంక్షేమ కార్యాలయాలలో హార్డ్ కాపీలు, అవసరమైన పత్రాలను ఫిబ్రవరి 20లోపు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.20 లక్షల స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. అలాగే టికెట్ ఛార్జీల కింద రూ.60 వేలు లేదాటికెట్ ధర (ఏది తక్కువైతే అది) చెల్లిస్తారు. నకిలీ సర్టిఫికెట్లతో (Fake Certificates) దరఖాస్తు చేసుకున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పథకం వివరాలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు చేసుకోవాల్సిన దేశాలు, అర్హత, తప్పనిసరి అవసరాలు, ఎంపిక విధానం కోసం www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలి.