Homeబిజినెస్​iPhone | చైనాకు యాపిల్​ బై బై.. ఇక భారత్​లోనే ఐఫోన్ల తయారీ!

iPhone | చైనాకు యాపిల్​ బై బై.. ఇక భారత్​లోనే ఐఫోన్ల తయారీ!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : iPhone | యాపిల్​ apple సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. చైనా chinaలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి భారత్ bharat​లో పెంచాలని భావిస్తోంది. ముఖ్యంగా అమెరికా americaకు సరఫరా చేసే ఐఫోన్ల iPhonesను భారత్​లో తయారు చేయాలని చూస్తోంది. అమెరికా అధ్యక్షుడు US President డోనాల్డ్​ ట్రంప్​ Donald Trump చైనాపై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్​లను విధించింది.

iPhone | ఆ కంపెనీలకు తలనొప్పి

అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు చాలా కంపెనీలకు తలనొప్పిగా మారాయి. ఇప్పటి వరకు స్మార్ట్​ఫోన్లు Smart Phones, కంప్యూటర్లు Computers ఎక్కువగా చైనాలోనే ఉత్పత్తి Produce అయ్యేవి. అయితే అమెరికాకు చెందిన కంపెనీలు కూడా చైనాలో వస్తువులను తయారు చేసి తమ దేశానికి తరలించేవి. యాపిల్​ apple company సంస్థ కూడా ఐఫోన్లకు చైనాలో తయారు చేసి అమెరికా మార్కెట్​ US Market లో విక్రయిస్తోంది. అయితే ప్రస్తుతం యూఎస్​ చైనా ఉత్పత్తులపై 245శాతం సుంకాలు విధించింది. దీంతో ఐఫోన్ల రేట్లు బాగా పెరిగి, కంపెనీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

iPhone | భారత్​కు తరలిస్తే..

చైనాలో ఉత్పత్తి చేసిన ఫోన్లపై టారిఫ్​లు విధిస్తుండటంతో యాపిల్​ దృష్టి భారత్​పై పడినట్లు తెలుస్తోంది. చైనాలో ఉత్పత్తిని తగ్గించి మనదేశంలో పెంచుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అమెరికాకు ఎగుమతి చేసే ఫోన్లను భారత్​లోనే తయారు చేస్తే టారిఫ్​ల Tariffs బాధ తప్పుతుందని కంపెనీ భావిస్తోంది. 2026 నాటికి అమెరికా మార్కెట్‌ కోసం ఐఫోన్ల తయారీ ప్రక్రియ మొత్తం భారత్‌ india కేంద్రంగానే జరిగేలా యాపిల్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి.

ఇప్పటివరకు అమెరికా బయట తయారు చేస్తున్న ఐఫోన్లలో భారత్‌ వాటా 14 శాతం కాగా.. దాదాపు 80 శాతం ఐఫోన్లు చైనాలోనే తయారవుతున్నాయి. ఇప్పుడు సుంకాల నేపథ్యంలో యాపిల్‌ apple పై అదనపు భారం పడనుంది. దీంతో భారత్​లో ఫోన్లను తయారు చేసి అమెరికా america మార్కెట్​లో విక్రయించాలని ఆ సంస్థ ఆలోచిస్తోంది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో యాపిల్‌ 22 బిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్లను భారత్‌లో తయారు చేసింది. ఇందులో 18 బిలియన్‌ డాలర్ల విలువైన ఫోన్లను ఇతర దేశాలకు చేయడం గమనార్హం.