- Advertisement -
Homeటెక్నాలజీiPhone | పండుగ ఆఫర్లు ప్రకటించిన ఆపిల్.. రూ.10 వేల వరకు తగ్గింపు

iPhone | పండుగ ఆఫర్లు ప్రకటించిన ఆపిల్.. రూ.10 వేల వరకు తగ్గింపు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : iPhone | ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఆపిల్ ఇండియాలో పండుగ ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 23 వరకు ఆపిల్ స్టోర్ ఆన్ లైన్, ఆపిల్ స్టోర్ యాప్(Apple Store App) సహా అన్ని ఆపిల్ రిటైల్ స్టోర్ల(Apple Retail Stores)లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. క్యాష్​బ్యాక్​ డీల్స్, నో-కాస్ట్ ఈఎంఐలు, ట్రేడ్-ఇన్ ప్రయోజనాలు అందిస్తోంది. కస్టమర్లకు షాపింగ్ చేయడానికి, ఉత్సాహంగా పండుగలను జరుపుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆపిల్ తెలిపింది.

iPhone | క్యాష్ బ్యాక్, ఈఎంఐలపై..

కొనుగోలుదారులు అమెరికన్ ఎక్స్​ప్రెస్, ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank), యాక్సిస్ బ్యాంక్(Axis Bank) క్రెడిట్ కార్డులను ఉపయోగించి రూ. 10,000 వరకు తక్షణ క్యాష్​బ్యాక్​ పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్, మాక్, ఆపిల్ వాచ్, ఎయిర్ పాడ్ లపై 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐని కూడా అందిస్తోంది.

- Advertisement -

iPhone | స్పెషల్ సెషన్లు

సీజన్ను గుర్తు చేసుకోవడానికి ఆపిల్ అక్టోబర్ 3 నుంచి 5 వరకు ఫొటోగ్రాఫర్ ఫర్హాన్ హుస్సేన్​తో కలిసి రూపొందించిన దీపావళి-స్పెషల్ టుడే ఎట్ ఆపిల్ సెషన్​ను నిర్వహిస్తోంది. సెషన్​లో పాల్గొనే వారికి ఐఫోన్లో దీపావళిని ఎలా నిర్వహించుకోవాలో నేర్పుతారు. అలాగే, పండుగ కాలంలో స్టోర్లలో రెగ్యులర్ టుడే ఎట్ ఆపిల్ సెషన్లు కొనసాగుతాయి. ఆపిల్ పండుగ షాపింగ్ చేసేవారి కోసం ఆన్​లైన్ పర్సనల్ సెషన్లు, నిపుణులతో లైవ్ వీడియో షాపింగ్, ఆపిల్ స్టోర్ యాప్ ద్వారా డిజిటల్ గిఫ్టింగ్ వంటి బహుళ సేవలను ప్రవేశపెట్టింది. వినియోగదారులు ఐప్యాడ్, ఎయిర్ పాడ్లు, ఎయిర్ ట్యాగ్, ఆపిల్ పెన్సిల్ వంటి ఉత్పత్తులను ప్రాంతీయ భాషలు, ఆంగ్లంలో ఉచితంగా వినియోగించుకోవచ్చు.
ఆపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ఆన్లైన్, ఆపిల్ స్టోర్లలో అర్హత కలిగిన స్మార్ట్ ఫోన్లు, మాక్లు, ఐప్యాడ్లు, ఆపిల్ వాచ్ మోడల్లకు తక్షణ క్రెడిట్​ను అందిస్తూనే ఉంది. ఎక్స్​ప్రెస్​, షెడ్యూల్డ్ డెలివరీతో సహా సౌకర్యవంతమైన డెలివరీ, పికప్ సెలక్షన్లు అన్ని చోట్లా అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News