HomeUncategorizedDonald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

Donald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ త‌గిలింది. జన్మతః పౌరసత్వంపై ట్రంప్ జారీ చేసిన కీల‌క ఆదేశాలను ర‌ద్దు చేసింది. అది రాజ్యాంగానికి విరుద్ధ‌మ‌ని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు (Federal Appeals Court) స్ప‌ష్టం చేసింది.

అమెరికా పౌరసత్వం లేని విదేశీ వలసదారులకు జన్మించిన పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) జారీచేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ వివాదాదాస్పదమైన సంగ‌తి తెలిసిందే. దీన్ని స‌వాలు చేస్తూ దాఖ‌లైన అభ్య‌ర్థ‌న‌ల‌పై స్పందించిన న్యూ హాంప్‌షైర్‌లోని ఫెడరల్ న్యాయమూర్తి ట్రంప్ ప్రణాళికను అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌(Executive Order)కు వ్య‌తిరేకంగా తీర్పు ఇచ్చింది. జ‌న్మ‌తః వార‌స‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని కోరుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పునిచ్చింది. దేశంలో దాని అమలును అడ్డుకుంది. ఈ వ్య‌వ‌హారం సుప్రీంకోర్టు(Supreme Court) ముందుకు త్వరగా రావడానికి అడుగు ముందుకు ప‌డింది.

Donald Trump | వివాదాస్ప‌ద ఉత్త‌ర్వుపై స్టే..

అమెరికా అధ్య‌క్షుడిగా రెండోసారి ఎన్నికైన ట్రంప్ అనేక సంస్క‌ర‌ణ‌ల‌కు తెర లేపారు. అమెరికా ఫస్ట్ నినాదం పేరిట వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. జ‌న్మ‌తః పౌర‌స‌త్వం ర‌ద్దు చేస్తూ ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాల్లో కీల‌క‌మైన‌ది. అమెరికా పౌరసత్వం లేని విదేశీ వలసదారులకు జన్మించిన పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ గ‌త జ‌న‌వ‌రిలో ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీచేశారు. అమెరికా(America)లో చట్టవిరుద్ధంగా లేక తాత్కాలిక వీసాలతో నివసిస్తున్న వారికి పుట్టిన పిల్లలకు జన్మతః పౌరసత్వం ఇవ్వొద్ద‌ని జారీ ఈ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్ తీవ్ర వివాదాస్పదమైంది. ఇది రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని ఈ ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వును న్యూ హ్యాంప్‌షైర్‌(New Hampshire)లోని ఫెడరల్‌ కోర్టు నిలిపివేసింది.

తాజాగా ఫెడ‌ర‌ల్ కోర్టు నిర్ణ‌యాన్ని అప్పీల్స్ కోర్టు స‌మ‌ర్థించింది. “యునైటెడ్ స్టేట్స్‌లో జన్మించిన చాలా మంది వ్యక్తులకు పౌరసత్వాన్ని నిరాకరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రతిపాదిత వివరణ రాజ్యాంగ విరుద్ధమని జిల్లా కోర్టు సరిగ్గా నిర్ధారించింది. దాన్ని మేము పూర్తిగా స‌మ‌ర్థిస్తున్నామ‌ని” అని అప్పీల్స్ కోర్టు స్ప‌ష్టం చేసింది. చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా అమెరికాలో ఉన్న వ్యక్తులకు జన్మించిన పిల్లలకు పౌరసత్వాన్ని నిరాకరించే ఉత్తర్వును అమలు చేయకుండా 9వ సర్క్యూట్ అడ్డుకుంటుంది.
మ‌రోవైపు, ఫెడ‌ర‌ల్ కోర్టు నిర్ణ‌యంపై ట్రంప్ యంత్రాంగం ఇప్ప‌టికే సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాల‌ని కోరింది. దీనిపై త్వ‌ర‌లోనే సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్ట‌నుంది.