అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Jagruthi | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha)పై కార్పొరేషన్ మాజీ ఛైర్మన్లు రాజీవ్‌సాగర్, మఠం భిక్షపతి చేసిన వ్యాఖ్యలను జాగృతి నాయకులు ఖండించారు. తెలంగాణ జాగృతి నేతలు సోమాజిగూడ (Somajiguda) ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు.
రాజీవ్ సాగర్, మఠం భిక్షపతి కవితపై చేసిన వ్యాఖ్యలు అర్థ రహితమని జాగృతి నాయకులు అన్నారు. కవితతోనే వారు కార్పొరేషన్ ఛైర్మన్లు అయ్యారని గుర్తు చేశారు. వారు ఇద్దరు తిన్నింటి వాసాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పకపోతే భౌతిక దాడులకు సైతం దిగుతామని వారు హెచ్చరించారు.
Telangana Jagruthi | వారి వెనుక హరీశ్‌రావు
రాజీవ్ సాగర్, మఠం భిక్షపతిల మాటల వెనుక మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఉన్నారని జాగృతి నాయకులు ఆరోపించారు. తీన్మార్ మల్లన్న కవితపై వ్యాఖ్యలు చేస్తే వీరు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి తమది అంటున్న రాజీవ్ సాగర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. రబ్బర్ చెప్పులు వేసుకుని వచ్చిన ఆయన ఈ రోజు కోట్లకు పడగలెత్తాడని ఆరోపణలు చేశారు.
జాగృతి కార్యకర్తలు కవితను కలుస్తామంటే కలవనీయకుండా రాజీవ్ సాగర్ అడ్డుకున్నారని ఆరోపించారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడానికి సైతం కవిత ప్రయత్నించారన్నారు. కానీ రాజీవ్‌సాగర్ నేడు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ కోసమే తాము జాగృతి కోసం పనిచేశామని రాజీవ్‌సాగర్ గురువారం పేర్కొన్న విషయం తెలిసిందే. 19 ఏళ్ల పాటు తమను అన్ని రకాలుగా వినియోగించుకొని.. ఇప్పుడు రోడ్డున పడేశారని ఆయన కవితపై ఆరోపణలు చేశారు. కవిత లేఖ బయటకు వచ్చిన నాటి నుంచి తాము జాగృతికి దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి నాయకులం తాము అన్నారు. ఈ క్రమంలో జాగృతి నాయకులు ఆయనపై మండిపడ్డారు.