Homeక్రీడలుTeam India | టీమిండియాకు కొత్త స్పాన్స‌ర్.. ఇక నుండి జెర్సీలు ఎలా ఉండ‌నున్నాయంటే..!

Team India | టీమిండియాకు కొత్త స్పాన్స‌ర్.. ఇక నుండి జెర్సీలు ఎలా ఉండ‌నున్నాయంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Team India | భారత క్రికెట్ ప్రేమికులకు తాజా అప్‌డేట్! టీమిండియా క్రికెట్ జెర్సీపై ఇకపై అపోలో టైర్స్ (Apollo Tyres) పేరు మెర‌వ‌నుంది. బీసీసీఐ (BCCI) తాజాగా ప్రకటించిన ప్రకారం, అపోలో టైర్స్ 2027 వరకు భారత జాతీయ క్రికెట్ జట్టుకు (Indian national cricket team) ఆధికారిక జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.

ఇప్పటివరకు జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11తో బీసీసీఐ ఒప్పందాన్ని ముగించింది. కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ సంబంధిత యాప్‌లపై నిషేధం విధించ‌డం ఈ మార్పునకు ప్రధాన కారణమైంది. ఈ పరిణామాల మధ్య అపోలో టైర్స్ ముందుకు వచ్చి బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది.

Team India | ఒక్క మ్యాచ్‌కు రూ. 4.5 కోట్లు

బీసీసీఐకు అపోలో టైర్స్ ప్రతి మ్యాచ్‌కు రూ. 4.5 కోట్లు చెల్లించనుంది. ఇది మునుపటి స్పాన్సర్ అయిన డ్రీమ్ 11 ఇచ్చిన రూ. 4 కోట్లకు 50 లక్షలు కన్నా ఎక్కువే. ఈ ఒప్పందం 130 అంతర్జాతీయ మ్యాచ్‌లకు (international matches) వర్తించనుంది. అంటే మొత్తం దాదాపు రూ. 585 కోట్లు లాభం వచ్చే అవకాశం ఉంది. ఈ జెర్సీ స్పాన్సర్‌షిప్‌ (Jersy Sponsorship) హక్కులను పొందేందుకు జేకే టైర్, బిర్లా ఓప్టన్ పెయింట్స్, కాన్వా వంటి పెద్ద సంస్థలు పోటీ పడ్డాయి.

చివరికు ఎంతో అనుభవం మరియు మార్కెట్ బ్రాండ్ విలువతో అపోలో టైర్స్ టాప్ బిడ్ వేసి విజేతగా నిలిచింది. బీసీసీఐ అధికార వర్గాలు ఈ ఒప్పందంపై సంతృప్తి వ్యక్తం చేశాయి. “భారత క్రికెట్ బ్రాండ్ విలువకు తగిన స్థాయిలో అపోలో టైర్స్ నుంచి వచ్చిన బిడ్ విశేషం. ఇది మేము ఆశించిన స్థాయికి మించి ఉంది” అని పేర్కొన్నారు.

టీమిండియా క్రికెట్ జెర్సీపై (Team India cricket jersey) ఇక నుంచి అపోలో టైర్స్ పేరు దర్శనమివ్వబోతోంది. క్రికెట్ అభిమానులకు ఇది కేవలం జెర్సీ మార్పు మాత్రమే కాదు – భారత క్రికెట్ బ్రాండ్ విలువ, మార్కెట్ డైనమిక్స్‌లో చోటు చేసుకున్న కొత్త దశగా చెప్పవచ్చు. ఆసియా క‌ప్‌లో ఇప్ప‌టికే భార‌త్ రెండు మ్యాచ్‌లు ఆడ‌గా, ఎలాంటి బ్రాండ్ లేని జెర్సీని Jersey ధ‌రించి మ్యాచ్ ఆడింది. మ‌రి త‌దుప‌రి మ్యాచ్‌లో అపోలో టైర్స్ జెర్సీతో మెర‌వ‌నున్నారా లేదా అనేది చూడాలి. టీమిండియా తాను ఆడిన రెండు మ్యాచ్‌ల‌లో ఘ‌న విజ‌యం సాధించ‌డంతో సూప‌ర్ 4కి అర్హ‌త సాధించింది.

Must Read
Related News