అక్షరటుడే, హైదరాబాద్: Apollo AyurVAID | కచ్చితత్వం, సమగ్రతతో కూడిన ఆయుర్వేద చికిత్స అందించేందుకు అపోలో AyurVAID హాస్పిటల్స్ తెలంగాణలోకి ప్రవేశించింది.
ఈమేరకు భారత్లోనే అతిపెద్ద రికవరీ హాస్పిటల్స్ చైన్ అయిన HCAH సువిటాస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. హైదరాబాద్లోని సోమాజిగూడలో తమ తొలి “AyurVAID HCAH సెంటర్ ఫర్ ప్రెసిషన్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్” ను ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ కేంద్రం ముఖ్యంగా ఇంటిగ్రేటివ్ న్యూరో రిహాబిలిటేటివ్ కేర్లో నిపుణత చూపిస్తుంది. సంక్లిష్ట, దీర్ఘకాలిక, క్షీణించిన అనారోగ్యాలతో బాధపడే రోగులకు సమగ్ర రీహాబిలిటేషన్, రికవరీ సేవలు అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
Apollo AyurVAID | అందించే ప్రత్యేక సేవలు
- నాడీ సంబంధిత రుగ్మతలు: తీవ్రమైన మెదడు గాయాలు, స్ట్రోక్, మోటార్-న్యూరాన్ వ్యాధులు.
- ఎముకల సంబంధిత రుగ్మతలు: మోకీలు, తుంటి మార్పిడి శస్త్రచికిత్స అనంతరం రీహాబిలిటేషన్.
- దీర్ఘకాలిక సమస్యలు: గుండె, శ్వాసకోశ, మూత్రపిండాల , kidney పనితీరు తగ్గడం, నయంకాని గాయాలు, బెడ్-సోర్లు.
- ప్రత్యేక విభాగాలు: పిల్లలలో ఎదుగుదల లోపాలు, వృద్ధాప్య సంరక్షణ.
- ఇక్కడ జీవక్రియ, ఆర్థో-న్యూరో, గైనకాలజీ, శ్వాసకోశ, మానసిక ఆరోగ్యం లాంటి అన్ని ప్రధాన వైద్య విభాగాలకు ఆయుర్వేద చికిత్సలు లభిస్తాయి.
- పైల్స్, ఫిస్టులా లాంటి అనోరెక్టల్ సమస్యలు, డయాబెటిక్ ఫుట్ లాంటి నయంకాని గాయాలకు ప్రత్యేక ఆయుర్వేద పారా-సర్జికల్ ప్రక్రియలు సైతం అందుబాటులో ఉన్నాయి.
Apollo AyurVAID | కేంద్రం ముఖ్యాంశాలు:
పడకల సామర్థ్యం: సమగ్ర రీహాబిలిటేషన్ సేవలకు మొత్తం 115 పడకలు ఉన్నాయి. ఇందులో ఆయుర్వేద చికిత్సల కోసం ప్రత్యేకంగా 20 పడకలు కేటాయించారు.
వైద్య విధానం: అనారోగ్య మూల కారణాలను గుర్తించి, సమగ్ర చికిత్స అందించే హోల్ పర్సన్ కేర్ (Whole Person Care) విధానానికి అపోలో AyurVAID ప్రాధాన్యం ఇస్తుందంటున్నారు.
కీలక మైలురాయి..
అపోలో ఆయుర్వేద్(AyurVAID) హాస్పిటల్స్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ వాసుదేవన్ మాట్లాడుతూ.. “ఆయుర్వేద శాస్త్రాన్ని వైద్యపరంగా దృఢమైన, ఫలితాల ఆధారిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థగా ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలనే మా ప్రయాణంలో.. తెలంగాణ ప్రవేశం ఒక ముఖ్య మైలురాయి. ఆయుర్వేద HCAH భాగస్వామ్యం కచ్చితమైన ఆయుర్వేదాన్ని ప్రపంచ స్థాయి రీహాబిలిటేషన్ నైపుణ్యంతో కలిపి సమగ్ర సంరక్షణ పరిధిని విస్తరిస్తుంది.. రాబోయే 5 ఏళ్లలో ఈ ప్రాంతంలో కనీసం 3 ఆసుపత్రులు ప్రారంభించాలని మేము ప్రణాళిక సిద్ధం రూపొందిస్తున్నాం..” అని తెలిపారు.
హెచ్సీఏహెచ్ సువిటాస్ కో ఫౌండర్, అధ్యక్షుడు డాక్టర్ గౌరవ్ తుక్రాల్ వ్యాఖ్యానిస్తూ.. “అపోలో AyurVAID తో మా అనుబంధం వ్యక్తిగతీకరించిన వైద్యం, రోగి-కేంద్రీకృత ఉమ్మడి విలువల కలయిక. ఆధునిక రిహాబ్ మార్గదర్శకాల బలాలు కచ్చితమైన ఆయుర్వేదంతో కలపడం ద్వారా భారతదేశంలో రికవరీ, రిహాబిలిటేషన్ విధానాన్ని తిరిగి నిర్వచించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. ఈ సమగ్ర సంరక్షణ నమూనాకు సోమాజిగూడ కేంద్రం విజయవంతమైన మోడల్ అవుతుందని నా ఆశ..” అని పేర్కొన్నారు.