ePaper
More
    HomeతెలంగాణHigh Court | హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్

    High Court | హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: High Court | తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ (Justice Aparesh Kumar Singh) నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) సోమవారం ఆమోదించారు. ప్రస్తుతం హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా కొనసాగుతున్న సుజయ్ పాల్‌ కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ అపరేష్ కుమార్ త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా (Tripura High Court Judge) పని చేశారు.

    అపరేష్ కుమార్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీలో ఎల్​ఎల్​బీ చదివారు. 1990 నుంచి 2000 వరకూ యూపీ హైకోర్టులో న్యాయవాదిగా (UP High Court Judge) పనిచేశారు. అనంతరం 2001లో జార్ఖండ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2012లో జార్ఖండ్ హైకోర్టు అదనపు జడ్జీగా నియామకం అయ్యారు. అనంతరం జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023 ఏప్రిల్ నుంచి త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి సాధించారు. తాజాగా తెలంగాణ తెలంగాణకు బదిలీపై వస్తున్నారు.

    More like this

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...