అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajyasabha | ఆంధ్రప్రదేశ్ AP నుంచి రాజ్యసభ Rajyasabha MP ఎంపీ అభ్యర్థిగా బీజేపీ BJP నేత పాక వెంకటసత్యనారాయణ Paka Venkata Satyanarayana ఖరారు అయ్యారు. ఈ మేరకు బీజేపీ ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ YSRCP నుంచి రాజ్యసభకు ఎన్నికైన విజయ సాయిరెడ్డి Vijaya Sai Reddy ఇటీవల పార్టీతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. సంఖ్యాబలం దృష్ట్యా ప్రస్తుతం ఆ సీటు కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. ఎంపీ ఎన్నిక కోసం మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు ముగియనున్న నామినేషన్లు స్వీకరించనున్నారు. సంఖ్యా బలం లేనందునా.. వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.
కాగా ఈ స్థానాన్ని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకి ఇస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో రాజ్యసభకు పంపిస్తారని వార్తలు వచ్చాయి. అలాగే కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు సైతం వినిపించింది. అయితే బీజేపీ మాత్రం అనుహ్యంగా సీనియర్ నేత పాక సత్యనారాయణకు అవకాశం ఇచ్చింది. భీమవరానికి చెందిన సత్యనారాయణ చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు.