అక్షరటుడే, వెబ్డెస్క్ : AP Ministers Threat Letters | ఆంధ్రప్రదేశ్లోని పలువురు మంత్రులకు బెదిరింపులు వచ్చాయి. మావోయిస్టుల పేరుతో జాగ్రత్తగా ఉండాలంటూ లేఖలు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
నలుగురు మంత్రులు కందుల దుర్గేష్ (Kandula Durgesh), అనగాని సత్యప్రసాద్ (Angani Satya Prasad), సత్యకుమార్, కొల్లు రవీంద్ర (Kollu Ravindra)కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు వచ్చాయి. జాగ్రత్తగా ఉండాలంటూ అందులో హెచ్చరించారు. ఈ లేఖపై కందుల దుర్గేష్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లేఖలపై అసెంబ్లీ లాబీలో విస్తృత చర్చ జరుగుతోంది. మంత్రులకు బెదిరింపు లేఖలు సంచలనం సృష్టించాయి. కందుల దుర్గేశ్ మంత్రి పేషీకే లేఖ నేరుగా రావడం గమనార్హం. దీంతో ఆయన పీఎస్ శ్రీనివాసరావు తుళ్లూరు పోలీసు (Thullur Police)లకు ఫిర్యాదు చేశారు.స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కందుల దుర్గేశ్ ప్రస్తుతం పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనతో పాటు కుటుంబాన్ని హతమారుస్తామని మావోయిస్టుల పేరుతో లేఖ రావడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, మంత్రి పేషీకి ఎలా చేరిందని ఆరా తీస్తున్నారు. నిజంగా మావోయిస్టులు లేఖ రాశారా లేక ఎవరైనా ఆకతాయిల పనా అని అనుమానిస్తున్నారు.
AP Ministers Threat Letters | ఎవరి పని
దేశవ్యాప్తంగా ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఆపరేషన్ కగార్ (Operation Kagar)తో మావోయిస్ట్ పార్టీ కకావికలం అయింది. అనేక మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు. కీలక నేతలు సైతం మరణించారు. మరోవైపు వేలాది మంది లొంగిపోయారు. దీంతో ప్రస్తుతం మావోయిస్టులు దాడులు చేయడం కంటే తమ రక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా మంత్రులకు లేఖలు బెదిరింపు లేఖలు రావడం గమనార్హం. మావోయిస్టు (Maoist)ల పేరిట ఇతరులు ఆ లేఖలు రాసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.