More
    Homeఆంధ్రప్రదేశ్​AP Mega DSC | ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్​ లిస్ట్​ విడుదల.. 15,941 మందికి...

    AP Mega DSC | ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్​ లిస్ట్​ విడుదల.. 15,941 మందికి కొలువులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Mega DSC | ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh) మెగా డీఎస్సీ (DSC) ఫైనల్​ లిస్ట్​ను అధికారులు సోమవారం ఉదయం విడుదల చేశారు. రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల (Teacher Posts) భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే.

    ఏపీలోని అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న డీఎస్సీ తుది జాబితా విడుదలైంది. కొలువులకు ఎంపికైన వారి వివరాలను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు మెగా డీఎస్సీ వెబ్‌సైట్‌లో వారి వివరాలు అందుబాటులో ఉంచింది. కలెక్టర్​, డీఈవో కార్యాలయాల్లో సైతం జాబితా అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.

    AP Mega DSC | 5,77,675 దరఖాస్తులు

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏప్రిల్​ 20న నోటిఫికేషన్​ విడుదల చేసింది. 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను ఆన్​లైన్​లో సమర్పించారు. జూన్‌ 6 నుంచి జులై 2 వరకు ఆన్​లైన్​ విధానంలో పరీక్షలు జరిగాయి. జులై 5న ప్రాథమిక కీ .. ఆగస్టు 1న ఫైనల్​ కీ ని అధికారులు విడుదల చేశారు.

    AP Mega DSC | భర్తీకాని 406 పోస్టులు

    డీఎస్సీ పరీక్షల్లో టెట్​ (TET)కు 20 శాతం వెయిటేజీ ఇచ్చారు. అనంతరం ఫలితాలు విడుదల చేశారు. ఏడు విడతలుగా అభ్యర్థుల సర్టిఫికెట్​ వెరిఫికేషన్​ నిర్వహించారు. తాజాగా 15,941 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. మరో 406 పోస్టులకు ఆయా విభాగాలకు సంబంధించిన అభర్థులు లేక పోవడంతో భర్తీ చేయలేదు. దీంతో ఆ పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. కాగా ఎంపికైన అభ్యర్థులకు త్వరలో పోస్టింగ్​ ఇవ్వనున్నారు.

    More like this

    Anganwadi Teachers | అంగన్​వాడీ కార్యకర్తల ముందస్తు అరెస్ట్​

    అక్షరటుడే, భీమ్​గల్: Anganwadi Teachers | నియోజకవర్గంలోని ఆయా మండల పరిధిలో అంగన్​వాడీ కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు....

    Hyderabad Floods | మంచం కోసం వెళ్లి నాలాలో కొట్టుకుపోయారు : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Floods | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆదివారం వర్షం బీభత్సం సృష్టించిన విషయం...

    RRB Notification | నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆర్‌ఆర్‌బీనుంచి జాబ్‌ నోటిఫికేషన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RRB Notification | భారత రైల్వేలో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నవారికి రైల్వే రిక్రూట్‌మెంట్‌...