Homeఆంధప్రదేశ్AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డికి బెయిల్..

AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డికి బెయిల్..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: AP Liquor Scam | ఏపీ లిక్కర్​ స్కాం కేసులో కీలక నిందితుడు, వైఎస్సార్​సీపీ ఎంపీ మిథున్​ రెడ్డి (YSRCP MP Mithun Reddy) బెయిల్​ మంజూరైంది. విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB court) షరతులతో కూడిన బెయిల్​ ఇచ్చింది. ఆయన ఈ కేసులో ఏ4గా ఉన్నారు.

ఎట్టకేలకు మిథున్​ రెడ్డికి బెయిల్​​ రావడంతో 71 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్​ జైలు (Rajahmundry Central Jail) నుంచి విడుదలయ్యారు. కాగా.. ఏపీ లిక్కర్​ స్కాం కేసులో రూ. 3,200 కోట్ల అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

AP Liquor Scam | కేసు నేపథ్యం..

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా అమలు చేసిన లిక్కర్ పాలసీలో (liquor policy) విస్తృత అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా.. కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఎస్‌ఐటీకి అప్పగించింది. దర్యాప్తు చేపట్టిన ఎస్​ఐటీ.. షెల్ కంపెనీల ద్వారా రూ. 3,200 కోట్ల మోసాలు జరిగినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో మిథున్​ రెడ్డి ఎస్‌ఐటీ అరెస్టు చేసింది.

సెప్టెంబర్ 6న వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో (Vice Presidential elections) ఓటు వేయడానికి ఆయన ఇంటరిమ్ బెయిల్ మంజూరైంది. అయితే, సెప్టెంబర్ 11న అతను మళ్లీ జైలుకు సరెండర్ అయ్యాడు. కాగా.. తాజాగా కోర్టు ఆయన బెయిల్​ మంజూరు చేసింది. రెండు ష్యూరిటీలు, రూ. 2 లక్షల పూచీకత్తు సమర్పించాలని సూచించింది. అంతేకాకుండా ప్రతి వారం శుక్రవారం, సోమవారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది.

Must Read
Related News