HomeUncategorizedHigh Court | ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. మతం మారితే అంతే సంగతులు

High Court | ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. మతం మారితే అంతే సంగతులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:High Court | ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు(Andhra Pradesh High court) సంచలన తీర్పు ఇచ్చింది. షెడ్యూల్డ్‌ కులాల(Schedule caste)కు చెందినవారు క్రైసవ మతం స్వీకరించిన రోజే వారి ఎస్సీ హోదా రద్దవుతుందని పేర్కొంది. వారు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని స్పష్టం చేసింది.

చర్చి పాస్టర్‌(Pastor) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పలువురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయడాన్ని న్యాయస్థానం తప్పు పట్టింది. క్రైస్తవంలోకి మారిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ చట్టం(SC, ST Act) కింద కేసులు నమోదు చేయలేరని, ఒకవేళ నమోదు చేసినా అది చెల్లదని తేల్చి చెప్పింది.

High Court | నేపథ్యమిది..

తనను కొంతమంది వ్యక్తులు కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని గుంటూరు(Guntur) జిల్లా పిట్లవాని పాలెం మండలం కొత్త పాలెం గ్రామానికి చెందిన పాస్టర్‌ ఆనంద్‌ 2021 జనవరిలో చందోల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా పోలీసులు(Police) గ్రామానికి చెందిన రామిరెడ్డితోపాటు మరో ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు గుంటూరు ఎస్సీ, ఎస్టీ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రామిరెడ్డి 2022లో హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. ఫిర్యాదుదారు పదేళ్లుగా పాస్టర్‌గా పనిచేస్తున్నారని, ఈ విషయాన్ని ఫిర్యాదు(Complaint)లోనే పేర్కొన్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. మతం మారిన వారికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని గతంలో సుప్రీంకోర్టు(Supreme court) తేల్చి చెప్పిందన్నారు. రామిరెడ్డిపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరారు.

వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పాస్టర్‌ దుర్వినియోగం(Misuse of SC, ST Act) చేశారని బుధవారం ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు. ఫిర్యాదుదారు మతం మారినందున ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని పేర్కొన్న న్యాయమూర్తి(Judge).. నిందితులపై పెట్టిన సెక్షన్లూ చెల్లుబాటు కావని తీర్పునిచ్చారు