అక్షరటుడే, వెబ్డెస్క్ : AP Govt | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యార్థులకు (Students) పెద్ద ఊరటను అందించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ (fee reimbursement) బకాయిల సమస్యపై కీలక నిర్ణయం తీసుకుంటూ 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలకు సంబంధించిన రూ.400 కోట్లను శనివారం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఆర్థికసాయం ద్వారా వేలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.ప్రభుత్వం ప్రకారం, 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు నేరుగా సంబంధిత కళాశాలల ఖాతాల్లోకి (Collages Account) జమ చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో విద్యార్థులు తిరిగి ఫీజుల కోసం పరితపించాల్సిన అవసరం లేకుండా, కాలేజీలు నిరవధిక సర్టిఫికెట్లు జారీ చేసే అవకాశం ఉంది.
AP Govt | 2023-24 ఫీజులు తల్లుల ఖాతాల్లోకి
అయితే, 2023-24 విద్యాసంవత్సరానికి ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. ఆ సంవత్సరానికి గల నిబంధనల ప్రకారం, ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి (Bank Accounts) జమ చేయాల్సి ఉంటుంది. కానీ చాలా కాలేజీలు విద్యార్థుల నుంచి ఇప్పటికే ఫీజులు Fees వసూలు చేసుకున్నట్లు ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దీంతో, ఈ నిధులను తిరిగి కాలేజీలకు పంపడం వల్ల ద్వంద్వ చెల్లింపుల ప్రమాదం ఉండటంతో, తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈసారి విడుదల చేసిన రూ.400 కోట్లలో ప్రధానంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులు లేదా ఇప్పటికే తమ చదువును పూర్తిచేసిన విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిధులు మంజూరు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. విద్యార్థుల ఉపాధి అవకాశాలను నిలకడగా కొనసాగించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిధుల విడుదలను వేగవంతం చేసింది.
విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు (Parents) ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. పాత ప్రభుత్వం (Old Government) ఉన్నప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలకు ఈ విధంగా పరిష్కారం చూపించడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉండగా, ప్రభుత్వం ఇదే విధంగా ముందున్న మిగతా విద్యా సంవత్సరాలకు సంబంధించిన బకాయిలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తుందని భావిస్తున్నారు. విద్యార్థుల విద్యను ఆర్థికంగా ప్రోత్సహించే దిశగా ఈ చర్యలు ఎంతో ప్రోత్సాహకరంగా భావించబడుతున్నాయి.