ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​IAS Transfers | ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ బదిలీలు.. కీలక నియామకాలు

    IAS Transfers | ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ బదిలీలు.. కీలక నియామకాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Transfers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ(IAS Transfers) చేసిన విష‌యం తెలిసిందే. ఈనెల 9న(మంగళవారం) 11 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేయ‌గా తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) పరిపాలనా వ్యవహారాల్లో కీలక నిర్ణయం తీసుకుంది.

    రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 మంది కలెక్టర్లను బదిలీ చేయగా, పలు ముఖ్యమైన విభాగాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ గురువారం ఈ ఉత్తర్వులు విడుదల చేశారు.

    IAS Transfers | బదిలీ అయిన కలెక్టర్లు:

    1. పార్వతీపురం మన్యం – ప్రభాకర్ రెడ్డి
    2. విజయనగరం – రామసుందర్ రెడ్డి
    3. ఈస్ట్ గోదావరి – కీర్తి చేకూరి
    4. గుంటూరు – తమీమ్ అన్సారియా
    5. పల్నాడు – కృతిక శుక్లా6. బాపట్ల – వినోద్ కుమార్
    7. ప్రకాశం – రాజా బాబు
    8. నెల్లూరు – హిమాన్షు శుక్లా
    9. అన్నమయ్య – నిషాంత్ కుమార్
    10. కర్నూలు – డాక్టర్ ఎ. సిరి
    11. అనంతపురం – ఓ. ఆనంద్
    12. శ్రీ సత్యసాయి – శ్యాంప్రసాద్

    IAS Transfers | కీలక నియామకాలు విష‌యానికి వ‌స్తే..

    టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా జే. శ్యామలరావు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎమ్.టి. కృష్ణబాబు బదిలీ అయ్యారు. అదనంగా పెట్టుబడులు, మౌలిక సదుపాయాల విభాగం బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు. మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా సౌరభ్ గౌర్. ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా ముకేష్ కుమార్ మీనా ఎంపిక‌య్యారు. అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా కాంతిలాల్ దండే, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరాం , మైనారిటీ సంక్షేమ శాఖ సెక్రటరీగా సీహెచ్ శ్రీధర్, ఎండోమెంట్స్ కార్యదర్శిగా హరిజవహర్ లాల్ (రిటైర్డ్), లేబర్, ఇన్సూరెన్స్ మెడికల్ కార్యదర్శిగా ఎం.వి. శేషగిరి బాబు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఢిల్లీ)గా ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ బదిలీలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

    More like this

    Rahul Gandhi | రాహుల్ ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాద‌క‌రం.. కాంగ్రెస్ నేత‌పై బీజేపీ విమ‌ర్శ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | ఉప రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి డుమ్మా కొట్టిన కాంగ్రెస్...

    Bheemgal | పట్టణాల్లో పట్టని ప్రణాళిక.. మున్సిపాలిటీల్లో పర్యవేక్షణ కరువు

    అక్షరటుడే, భీమ్‌గల్‌: Bheemgal | మున్సిపాలిటీల్లో పట్టణ ప్రణాళికా విభాగం (town planning department) అధికారులు, సిబ్బంది పాత్ర...

    BC Reservation Bill | మైనార్టీల కోసమే బీసీ రిజర్వేషన్​ బిల్లు పెడుతున్నారు..

    అక్షరటుడే, ఇందూరు: BC Reservation Bill | కామారెడ్డిలో బీసీల పేరుతో నిర్వహించనున్న సభ మైనారిటీల కోసమేనని.. బీసీ...