అక్షరటుడే, వెబ్డెస్క్:Talliki Vandanam Scheme | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని కూటమి ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా పాఠశాలల (Schools reopen) పున:ప్రారంభం సందర్భంగా ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు.. నిధులను విడుదల చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 42,69,459 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 67,27,164 మంది విద్యార్థులకు నిధులు జమ చేయనున్నారు. రూ.15 వేలల్లో రూ.2 వేలను కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే ఖాతాలకు మళ్లించి పాఠశాలల నిర్వహణ, అభివృద్ధి, పారిశుద్ధ్యం కోసం వినియోగించాలని ఆదేశాల్లో వెల్లడించారు. రూ.13 వేలను తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. తల్లికి వందనం నిధులను ఆయా కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయాలని ప్రభుత్వం (Ap Government) ఆదేశించింది.
Talliki Vandanam Scheme | తల్లుల ఖాతాల్లో జమ
ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెట్ పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు (Students) అందరికీ ఈ పథకం అమలు చేయనున్నారు. ప్రతి విద్యార్థికి ఈ పథకంలో భాగంగా రూ.15 వేలు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అయితే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు మాత్రమే జమ చేయనున్నారు. మిగతా రూ.రెండు వేలు స్కూళ్లు, కాలేజీల అభివృద్ధి పనుల కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ లింక్ అయి ఉన్న బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఒక వేళ విద్యార్థులకు తల్లి లేకపోతే తండ్రి ఖాతాలో జమ చేస్తారు. తల్లిదండ్రులు ఇద్దరు లేకపోతే సంరక్షకుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు.
Talliki Vandanam Scheme | అర్హులు వీరే..
- గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.పది వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు.
- నెలకు 300 యూనిట్ల కరెంట్ బిల్లు దాటకుండా ఉండాలి.
- విద్యార్థుల హాజరు శాతం 75శాతానికి పైగా ఉండాలి.
- రేషన్ కార్డు ఉన్న వారే ఈ పథకానికి అర్హులు.
- కుటుంబంలో ఎవరికైనా ఫోర్ వీలర్ వాహనం ఉన్నవారు, ఇన్కం ట్యాక్స్ కట్టే వారికి ఈ పథకం వర్తించదు.
- కుటుంబానికి మూడు ఎకరాలకు మించి రెండు పంటలు పండే భూమి ఉండకూడదు. పది ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్న వారు కూడా అర్హులే.