HomeUncategorizedSmart Ration Cards | ఏపీ పేద‌ల‌కి స్మార్ట్ కార్డ్ పంపిణీ ప్రారంభం.. ఒక్కో కార్డ్‌కి...

Smart Ration Cards | ఏపీ పేద‌ల‌కి స్మార్ట్ కార్డ్ పంపిణీ ప్రారంభం.. ఒక్కో కార్డ్‌కి అయ్యే ఖ‌ర్చు ఎంతో తెలుసా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Smart Ration Cards | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP state government) పేదలకు మరింత సులభతరంగా, పారదర్శకంగా రేషన్ సరఫరా చేయడంకోసం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించింది . ఏటీఎం కార్డు (ATM card) ఆకారంలో ఉండే ఈ కార్డుల్లో క్యూఆర్ కోడ్ ద్వారా లబ్ధిదారుల వివరాలు, రేషన్ సరఫరా సమాచారం సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

స్మార్ట్ రేషన్ కార్డుల (smart ration cards) పంపిణీ ఆగస్టు 25న ప్రారంభమై, సెప్టెంబర్ 15 వరకు నాలుగు విడతల్లో కొనసాగనుంది. తొలి విడతగా 9 జిల్లాల్లో ఇంటింటికీ పంపిణీ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఈ కార్డులు అందించనున్నారు. అయితే ప్రతి స్మార్ట్ రేషన్ కార్డు తయారీకి ప్రభుత్వం రూ.4.66 ఖర్చు చేస్తోంది.

Smart Ration Cards | ఖర్చు ఎంత అంటే…

ఇందుకోసం రూ. 8 కోట్లు నిధులు విడుదల చేస్తూ పౌరసరఫరాల శాఖకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఈ స్మార్ట్ కార్డుల్లో ఉండే క్యూఆర్ కోడ్ (QR code) స్కాన్ చేయగానే కుటుంబ సభ్యుల వివరాలు, ఈకేవైసీ స్థితి, లబ్ధిదారుడికి కేటాయించిన రేషన్ పరిమాణం, డిపో పేరు, స్టాక్ వివరాలు అన్నీ క్లియ‌ర్‌గా కనిపిస్తాయి. రేషన్ తీసుకున్న వెంటనే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు కూడా సమాచారం అందేలా ప్రభుత్వం ప్ర‌త్యేక‌ ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా ఎక్కడి వారైనా, ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే అవ‌కాశం క‌ల్పించింది.

ఈ కార్డ్ రేషన్ దుర్వినియోగాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించనుంది. ఆగస్టు 30 నుంచి : కాకినాడ (kakinada), ఏలూరు, గుంటూరు, చిత్తూరులో , సెప్టెంబర్ 6 నుంచి : పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, కోనసీమ, అనకాపల్లిలో సెప్టెంబర్ 15 నుంచి (చివరి విడత) : బాపట్ల, పల్నాడు, కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, నంద్యాల, కర్నూలు, ప్రకాశంలో విడ‌త‌ల వారీగా రేష‌న్ కార్డులు పంపిణీ చేయ‌నున్నారు. పౌరసరఫరాల వ్యవస్థను (Civil supply system) మరింత ఆధునికీకరించి, ప్రతి లబ్ధిదారుడికి సరైన విధంగా రేషన్ చేరేలా చూడడమే ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ఉద్దేశం అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.