అక్షరటుడే, వెబ్డెస్క్: AP Free Bus Travel Women | ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh )ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు పెద్ద ఉపశమనంగా మారిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని లక్షలాది మహిళలు వినియోగించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో మహాశివరాత్రి (Mahashivratri) పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ ఆర్టీసీ మహిళలకు మరో శుభవార్త ప్రకటించింది. ఈ నెల 15న నడిచే ప్రత్యేక బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
AP Free Bus Travel Women | పల్నాడు జిల్లాలో భారీ ఏర్పాట్లు
పల్నాడు జిల్లా (Palnadu District)లో ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్ల సందర్భంగా ఆర్టీసీ భారీ స్థాయిలో ప్రత్యేక బస్సులు (Special Buses) నడుపుతోంది.గత ఏడాదితో పోలిస్తే ఈసారి అదనంగా 70 బస్సులు పెంచారు. మొత్తం 618 ప్రత్యేక బస్సులు భక్తుల కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నారు.దాదాపు 2,000 మంది సిబ్బందితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. సాధారణ రోజుల్లో ఎలా ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందో, అదే విధంగా స్పెషల్ బస్సుల్లో కూడా మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. భక్తులు (Devotees) ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.