Homeజిల్లాలునిజామాబాద్​SSC Results | ఏపీ టెన్త్​ ఫలితాల్లో మెరిసిన జిల్లా విద్యార్థి.. గోల్డ్​ మెడల్ అందజేసిన...

SSC Results | ఏపీ టెన్త్​ ఫలితాల్లో మెరిసిన జిల్లా విద్యార్థి.. గోల్డ్​ మెడల్ అందజేసిన ప్రభుత్వం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: SSC Results | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)​ పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను అక్కడి ప్రభుత్వం షైనింగ్​ స్టార్స్​(Shining Stars) ప్రోగ్రాం ద్వారా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్, సర్టిఫికెట్, రూ.20 వేల స్టైఫండ్ అందజేసింది. నిజామాబాద్ జిల్లా(Nizamabad District) చెందిన చాట్ల రవిప్రసాద్​ కుమారుడు ఆదిత్య సాయి ఏపీ పదో తరగతి ఫలితాల్లో 594 మార్కులు సాధించాడు. దీంతో కృష్ణా జిల్లా కలెక్టర్​ డీకే బాలాజీ, అదనపు కలెక్టర్​ గీతాంజలి శర్మ విద్యార్థికి గోల్డ్​ మెడల్(Gold medal)​, స్టైఫండ్​ చెక్కు(stipend check) అందజేశారు.