ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​AP CM | చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్.. ఏపీకి రూ.వేల కోట్ల ప్రాజెక్ట్

    AP CM | చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్.. ఏపీకి రూ.వేల కోట్ల ప్రాజెక్ట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: AP CM | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Andhra Pradesh Chief Minister Chandrababu Naidu) రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాలలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రతిపాదనల్ని కేంద్రమంత్రులకు (Union Ministers) సీఎం చంద్రబాబు నాయుడు అందజేశారు. రాష్ట్రంలో మరిన్ని సైనిక్ స్కూళ్లు, DRDO సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో (Defense Minister Rajnath Singh) జరిగిన ప్ర‌త్యేక‌ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లను ఆయనకి తెలియ‌జేశారు. లేపాక్షి-మడకశిర (Lepakshi and Madakasira) మధ్య అందుబాటులో ఉన్న 10 వేల ఎకరాల్లో సైనిక, పౌర విమానాల తయారీ, రక్షణ రంగ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, ఏరోస్పేస్ ఎకో సిస్టం ఏర్పాటు చేయాలని కోరారు.

    AP CM | పెద్ద ప్రాజెక్టులే..

    కాంగ్రెస్ పాలిత కర్ణాటక నుంచి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (Hindustan Aeronautics Limited) అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ AMCA , లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ LCA ఉత్పత్తిని తన రాష్ట్రానికి తరలించాలని ప్రతిపాదించారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఒక గంట సమయం పట్టే దూరంలో ఉన్న.. లేపాక్షి-మడకశిర హబ్‌లో HAL కు సంబంధించి AMCA ఉత్పత్తి సౌకర్యం కోసం 10,000 ఎకరాల భూమిని చంద్రబాబు ప్రతిపాదించారు.. ఈ ప్రాజెక్టు విలువ రూ.వేల కోట్లలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొత్తగా సైనిక్ స్కూళ్లు (new Sainik schools) ఇవ్వాలని, తిరుపతి ఐఐటీలో DRDO సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

    జగ్గయ్యపేట-దొనకొండ క్లస్టర్‌లో (Jaggayyapet-Donakonda cluster) 6 వేల ఎకరాల్లో క్షిపణులు, ఆయుధ సామగ్రి ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. విశాఖపట్నం-అనకాపల్లి క్లస్టర్‌లో (Visakhapatnam-Anakapalle cluster) నౌకా రంగానికి అవసరమైన పరికరాల ఉత్పత్తి, ఆయుధాల పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. బెంగళూరు-హైదరాబాద్ కారిడార్‌లో లేపాక్షి-ఓర్వకల్లు (Lepakshi and Orvakal) మధ్య ఎలక్ట్రానిక్ సిటీ రాబోతుందున్నారు. త్వరలోనే ఎంవోయూ చేసుకుంటామని తెలిపారు. మూడు నెలల్లో సిటీ నిర్మాణ పనులు మొదలుపెట్టాలని చెప్పామని, భూకేటాయింపులు త్వరగా పూర్తి చేసి ముందడుగు వేస్తామని ఆయన అన్నారు. లేపాక్షి-ఓర్వకల్లు మధ్య పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఓర్వకల్లులో సైన్యానికి, వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే డ్రోన్లు తయారు చేస్తామని, దీనిని దేశానికి ఒక హబ్‌గా తయారు చేస్తామని ఆయన అన్నారు.

    More like this

    Lingampet | విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని మండల బీజేపీ (Lingampet BJP)...

    Hydraa | రూ.500 కోట్ల విలువైన భూమి కబ్జా.. షాకిచ్చిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో హైడ్రా దూకుడుగా...

    Bigala Ganesh Gupta | కిరణ్​కుమార్​ గౌడ్​కు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బిగాల

    అక్షరటుడే, ఇందూరు: Bigala Ganesh Gupta | ప్రముఖ న్యాయవాది కిరణ్​కుమార్​ గౌడ్​ శుక్రవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు....