అక్షరటుడే, వెబ్డెస్క్ : Chandrababu | పేదలందరికీ 2029 వరకు ఇల్లు ఉండాలన్నదే తమ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగూడపల్లి (Devagudapalli)లో ఆయన బుధవారం పర్యటించారు.
పేదల కోసం నిర్మించిన ఎన్నీఆర్ పక్కా గృహాలను ఆయన ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఎన్టీఆర్ పక్కా గృహాలను ప్రారంభించారు. చంద్రబాబు (CM Chandrababu) గ్రామంలో పలువురికి కొత్త ఇంటి తాళాలు అప్పగించారు. అనంతరం వర్చువల్గా రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల పంపిణీని ప్రారంభించారు. అనంతరం ప్రజావేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబు ప్రసంగించారు.
Chandrababu | పేదల ప్రభుత్వం
తమది పేదల ప్రభుత్వమని ఏపీ సీఎం అన్నారు. సొంతిళ్లు అనేది ప్రజల భవిష్యత్తుకు నాంది అని చెప్పారు. కూడు గూడు గుడ్డ నినాదంతో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఏర్పాటు అయిందని గుర్తు చేశారు. ప్రస్తుతం 3 లక్షల ఇళ్లు ప్రారంభించామని, ఉగాది నాటికి మిగతావి పూర్తి చేసి పంపిణీ చేస్తామని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు (MSME Parks) ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
Chandrababu | వైసీపీ పాలనలో నష్టపోయాం
ఇళ్లపై సోలార్ యూనిట్లు (Solar Units) ఏర్పాటు చేసేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లించకుంటే.. రాష్ట్రానికే నష్టమని ఆయన వెల్లడించారు. వైసీపీ హయాంలో ఇలా వాటా ఇవ్వక చాలా నష్టపోయామని చెప్పారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకు వస్తామని ఆయన తెలిపారు.
