అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kota Srinivasa Rao | ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao ) మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సంతాపం తెలిపారు. ఆయన పార్థీవ దేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు మృతి చాలా బాధాకరమన్నారు. చలన చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి కోటా అని కొనియాడారు. 40 ఏళ్ల పాటు ఆయన సినీ రంగంలో సేవలు అందించారన్నారు.
కోటా శ్రీనివాసరావుతో తనకు మంచి సంబంధాలు ఉండేవని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను సీఎంగా ఉన్నప్పుడు కోటా ఎమ్మెల్యే (MLA)గా ఉన్నారన్నారు. కోటా శ్రీనివాసరావు 1999 నుంచి 2004 వరకు బీజీపీ ఎమ్మెల్యేగా పని చేశారు. ఎమ్మెల్యేగా ప్రజా సేవలో కూడా కోటా బాగా కృషి చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. విలక్షణ నటుడిగా ప్రఖ్యాత పొందిన వ్యక్తి కోటా అన్నారు. 750 సినిమాల్లో నటించిన కోటా మృతి చెందడం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు.